HomeTelugu Trending'భాగ్‌ సాలే' టీజర్‌

‘భాగ్‌ సాలే’ టీజర్‌

BHAAG SAALE teaser 1
శ్రీ సింహ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్ సాలే’. ఈ సినిమాని ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సింహ ఇప్పటి వరకు డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ వచ్చాడు. కాగాఈ భాగ్ సాలే కూడా అంతే భిన్నంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన టీజర్ ని చూస్తే అర్థమౌతోంది.

ఈ టీజర్ ని డిజే టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆయన హీరోని పరిచయం చేస్తూ టీజర్ స్టార్ట్ చేయలేదు. సినిమా బ్యాగ్రౌండ్ కథను వినిపించారు. నిజంగా చిన్న పిల్లలకు చెబుతున్న కథలాగానే ఉంది. చివరికి ఆ కథ ఓ ఉంగరం దగ్గర ఆగింది. ఆ ఉంగరం మన హీరో దగ్గర ఉంటుందనే విషయం టీజర్ ని బట్టి అర్థమౌతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేదే సినిమా కథ.

టీజర్ తోనే మూవీపై మేకర్స్ అంచనాలు పెంచేశారు. సిద్దూ చాలా ఫన్నీగా స్టోరీ చెప్పిన విధానం కూడా బాగుంది. తమ మూవీ కచ్చితంగా క్రైమ్- కామెడీ ఎంటర్ ట్రైనర్ ఆఫ్ ది ఇయర్ గా అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

ఈ సినిమాలో నేహా సోలంకీ, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు. ఈ సినిమాకు సంగీతం కాల భైరవ అందిస్తుండగాఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu