HomeTelugu Trendingభాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు.. ఫస్ట్‌ లుక్ విడుదల

భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు.. ఫస్ట్‌ లుక్ విడుదల

11 18నటుడిగా సినిమాల్లో ప్రవేశించి ఆ తర్వాత హీరోగా ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు దర్శక, నిర్మాతగా మారనున్నాడు. స్వీయ దర్శకత్వంలో శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి తో పాటు వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్, ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్య, శ్రీనివాసరెడ్డి, శంకర్ ముగ్గురూ కలర్ ఫుల్ కోట్లు ధరించి, కూలింగ్ గ్లాసెస్ తో యమా స్టైల్ గా కనిపిస్తున్నారు. పైన డాలర్ నోట్లు ఎగరుతూ ఉన్నాయి. ఈ సినిమాకు భరణి కే దరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
సాకేత్ సంగీత దర్శకుడు. కథ.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందించిన వారు పరమ్. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu