భానుప్రియకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్!

ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేది. కళ్ళతో అభినయాన్ని
పలికించే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. అగ్ర హీరోలందరి సరసన నటించిన
ఆమెకు ప్రముఖ దర్శకుడు వంశీ ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో
భానుప్రియ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె నటించిన సితార, అన్వేషణ, ఆలాపన వంటి చిత్రాలు తన
కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారాయి. ఆ సినిమాల సమయంలో దర్శకుడు వంశీ ఆమెతో ప్రేమలో
ఉన్నాడని, అందుకే తెరపై ఆమెను అంత అందంగా చూపిస్తున్నాడని చెప్పుకునేవాళ్లు. అది రూమర్
కాదని.. భానుప్రియ మాటల ద్వారా తెలుస్తోంది. అయితే ఆయన ప్రపోజ్ చేసే సమయానికి ఆయనకు
ఆల్రెడీ పెళ్లి అయినందువలనే తాను అంగీకరించలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం భానుప్రియకు సినిమాల
అవకాశాలు సరిగ్గా రావడం లేదు. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు.