‘భీమ్లానాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది!

ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. రామ్ మిరియాల , శ్రీ కృష్ణ, పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు.

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్‌ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates