HomeTelugu Big Storiesమరోసారి దేవుడి పాత్రలో పవన్‌ కళ్యాణ్‌!

మరోసారి దేవుడి పాత్రలో పవన్‌ కళ్యాణ్‌!

Pawan once again god role

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ ఇప్పటికే దేవుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ‘గోపాల గోపాల’ సినిమాలో కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర అయినా మనిషి రూపంలోనే కనిపించి కనువిందు చేశాడు. ఆ పాత్రను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పవన్ క్రేజ్ వల్లే అది సాధ్యం అయింది. ఇక ఇప్పుడు మరోసారి పవన్ దేవుడిగా వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తతున్నాయి.

తెలుగులో విలన్ గా బిజీ అయిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తమిళంలో డైరెక్ట్ చేసిన సినిమా ‘వినోధాయ సిత్తం’. సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలను పోషించారు. జీవితం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో తంబి రామయ్య హఠాత్తుగా చనిపోతాడు. పరలోకంలో అడుగుపెట్టనా ప్రశాంతంగా లేక పోవడం గమనించి దేవుడు కారణం అడుగుతాడు. తనని మూడు నెలల పాటు బ్రతికిస్తే బాధ్యతలు నెరవేర్చుకుని వచ్చేస్తానని దేవుడిని కోరతాడు తంబిరామయ్య. దానికి దేవుడు అంగీకరిస్తాడు. తిరిగి భూమి మీదకి వచ్చిన తంబి రామయ్యకు ఎదురయ్యే పరిస్థితులు ఏమిటన్నదే ఈ సినిమా కథ. తమిళంలో దేవుడి పాత్రను సముద్రఖని చేశాడు. తెలుగులో ఈ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారట. సముద్రఖని దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కనుంది. తంబిరామయ్య పాత్రను ఎవరు పోషిస్తారు? మిగిలిన తారాగణం గురించి తెలియాల్సి ఉంది. ఈ సినిమా తరువాతే పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ లో అడుగు పెడతాడు అని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu