HomeTelugu Newsవెంకీ కుడుములకు మెగా ఆఫర్..

వెంకీ కుడుములకు మెగా ఆఫర్..

14 14

వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మతో మరో విజయం అందుకున్నాడు. ఈ సినిమా నితిన్‌ హీరోగా నటించాడు.. యూనిక్ సబ్జెట్ కావడంతో ప్రతి ఒక్కరికి నచ్చింది. ఒక సోషల్ మెసేజ్‌కు లవ్ స్టోరీని జతచేయడంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పటికే రూ.14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తోంది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండటంతో వెంకీకి ఛాన్స్ ఇచ్చేందుకు హీరోలు సిద్ధం అవుతున్నారు.

ఈలిస్ట్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నట్టుగా సమాచారం. ఇటీవలే రామ్ చరణ్ కు వెంకీ ఓ స్టోరీ లైన్ చెప్పారట. లైన్ నచ్చడంతో స్టోరీ డెవలప్ చేయమని అన్నారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే, వెంకీ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. కాగా వెంకీ కుడుముల నాగశౌర్య ‘ఛలో’ తొలి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu