HomeTelugu News'బిగ్‌బాస్‌ 3' కి కౌశల్‌ వార్నింగ్‌

‘బిగ్‌బాస్‌ 3’ కి కౌశల్‌ వార్నింగ్‌

13 13తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 3’లో తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు సీజన్‌ 2 విజేత కౌశల్‌. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. ‘వార్నింగ్‌.. బిగ్‌బాస్‌ 3 లో పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ కౌశల్‌ ఆర్మీ అన్న పేరును వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ 3లో పాల్గొన్న శ్రీముఖి అభిమానులు ‘శ్రీముఖి ఆర్మీ’ పేరిట సోషల్‌మీడియా ఖాతాలను తెరిచారు. ఆమెకు సపోర్ట్‌ చేయాల్సిందిగా నెటిజన్లను కోరుతున్నారు.

తమిళ బిగ్‌బాస్‌ షోలో ఓవియా ఆర్మీ, తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కౌశల్‌ ఆర్మీ పేర్లు బాగా పాపులర్‌ అయ్యాయి. కౌశల్‌ గెలవాలని అభిమానులు విజయవాడ, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టారు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సీజన్‌ 3లో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. మరోపక్క ఈ షోపై కేసు నడుస్తోంది. షోను ప్రసారం చేస్తున్న ఛానెల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu