HomeTelugu Reviewsరివ్యూ: బేతాళుడు

రివ్యూ: బేతాళుడు

నటీనటులు: విజయ్ ఆంటోని, అరుందతి నాయర్, మీరా కృష్ణన్, మహేంద్ర, మురుగదాస్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోని
దర్శకుడు: ప్రదీప్ కృష్ణమూర్తి
బిచ్చ‌గాడు` అనంతరం విజ‌య్ ఆంటోని న‌టించిన `భేతాళుడు` కోసం తెలుగు ప్రేక్ష‌కులు
ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, అటు కామ‌న్ జ‌నాల్లోనూ
అత‌డి సినిమాపై ఒక‌టే క్యూరియాసిటీ. అనుకున్న‌ట్టే భేతాళుడు మూవీ దాదాపు 500
థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజైంది. వైవిధ్యమైన కథలను ఎన్నుకునే విజయ్ ఆంటోని ఓ డిఫరెంట్
కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతవరకు
రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
దినేష్(విజయ్ ఆంటోనీ) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు.
పని విషయంలో అతడు చాలా తెలివైన వ్యక్తి. ఓ సారి మాట్రీమోనిలో ఐశ్వర్య(అరుందతి) అనే
అమ్మాయిని చూసి తననే పెళ్లి చేసుకుంటాడు. ఐశ్వర్య అనాధ కావడంతో భర్త, ఇళ్లే ప్రపంచంగా
బ్రతికేది. ఒకరోజు సడెన్ గా దినేష్ కు తనతో ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ
వింత శబ్ధాలు అతడిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో తన బాస్ దినేష్ ను
సైకియార్ట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్తాడు. డాక్టర్ దినేష్ ను హిప్నటైజ్ చేసి తన గత జన్మ వివరాలను
తెలుసుకుంటాడు. దినేష్ గత జన్మలో శర్మ అనే ఓ స్కూల్ టీచర్ అని.. అతడిని పెళ్లి చేసుకున్న
భార్య జయలక్ష్మీ శర్మను అతడి దత్త పుత్రుడిని చంపేస్తుందని డాక్టర్ తెలుసుకుంటాడు. అదే
సమయంలో దినేష్ కు జయలక్ష్మీను చంపేయ్ అంటూ ఓ గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఆ
తరువాత ఏం జరిగింది..? గత జన్మలో పగ ఈ జన్మలో తీర్చుకుంటాడా..? అసలు జయలక్ష్మీ
తన భర్తను ఎందుకు చంపుతుంది..? దినేష్ ఈ సమస్య్లల నుండి ఎలా బయటపడతాడు..?
అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
విజయ్ ఆంటోని
నేపధ్య సంగీతం
కథ
మైనస్ పాయింట్స్:
కథనం
సెకండ్ హాఫ్
విశ్లేషణ:
భేతాళుడు అనే టైటిల్ చూసి ఇదొక హారర్ సినిమా అనుకుంటే తప్పే.. ఇదొక త్రిల్లర్ కథ అని
తెలుస్తోంది. అప్పటివరకు ఓ వ్యక్తి మానసిక రుగ్మతతో బాధ పడుతున్నాడు అనుకుంటే దానికి
కారణం అతడికి తెలియకుండా అతడి శరీరంలో ఇంజెక్ట్ చేసిన డ్రగ్స్ అని తెలుస్తోంది. దీంతో
ఆ వివరాలు తెలుసుకోవడానికి హీరో ప్రయత్నించడం తన భార్యే తనకు డ్రగ్స్ ఇచ్చిందని
తెలుసుకోవడం.. ఇలా కథను కొత్తగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్
తెరకెక్కించినంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ లేకపోవడం విసుగు పుట్టిస్తుంది. చాలా సేపటివరకు
కథలోకి వెళ్లకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష. ఒకసారి కథలోకి వెళ్ళిన తరువాత కథనంతో
విసుగు పుట్టించాడు. అయితే విజయ్ ఆంటోనీ నటన సినిమాకు పెద్ద ప్లస్. మూడు డిఫరెంట్
షేడ్స్ ఉన్న పాత్రలో అధ్బుతంగా నటించాడు. విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ కు ఈ సినిమా విపరీతంగా
నచ్చుతుందనడంలో సందేహం లేదు. అతడు అందించిన సంగీతం సినిమాకు మరో అసెట్.
ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘జయలక్ష్మీ’ అనే పాట. ఆ పాటను విజయ్ ఆంటోనీ పాడడం
విశేషం. ఫోటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. డైరెక్టర్
అనుకున్న కథను ప్రెజంట్ చేసే విషయంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. బిచ్చగాడు
సినిమా చూసి అదే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందనుకుంటే పొరపాటే. మరీ ఆడియన్స్ కు
బోర్ కొట్టించకపోయినా.. ఊహించిన అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.
రేటింగ్: 2.5/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu