HomeTelugu Trendingచిరంజీవి 'భోళా శంకర్‌' షురూ

చిరంజీవి ‘భోళా శంకర్‌’ షురూ

Bhola shankar movie launch

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం‘భోళా శంకర్’ ప్రారంభమైంది. మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు.

Bhola shankar movie 1
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించనుంది. అలాగే తమన్నా హీరోయిన్‌గా అలరించనుంది. మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu