HomeTelugu Trendingబిచ్చగాడు సీక్వెల్ పోస్టర్ విడుదల

బిచ్చగాడు సీక్వెల్ పోస్టర్ విడుదల

Bichagadu 2 poster release

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా ‘బిచ్చగాడు’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి అంచనాలు లేనప్పటికీ భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగానే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. అమ్మ సెంటిమెంటును అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు విజయ్ తెలిపాడు. బిచ్చగాడు-2 సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా పూర్తిచేసి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu