HomeTelugu Trendingవిజయ్‌ ఆంటోనీ 'బిచ్చగాడు2' ఫస్ట్‌లుక్‌

విజయ్‌ ఆంటోనీ ‘బిచ్చగాడు2’ ఫస్ట్‌లుక్‌

Vijay antony bichagadu 2 fi

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం బిచ్చగాడు. ఈ సినిమా ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు నాట సైతం ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడు ‘బిచ్చగాడు’చిత్రానికి కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ సినిమా ను విజయ్‌ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.

ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తేలియజేస్తూ.. ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu