‘బిచ్చగాడు’ సాంగ్‌ అప్డేట్‌


చిన్న సినిమాగా విడుదలైన ‘బిచ్చగాడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడేళ్ల క్రితం విడుదలైన ఈసినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన స్నీక్ పీక్ వీడియో, థీమ్ సాంగ్ ఈ సీక్వెల్ పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.

బ్రెయిన్ ట్రాన్స్ ప్లంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు తమిళ, ఇటు తెలుగులో మంచి హైపే ఉంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్‌లను విడుదల చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని మ్యూజికల్ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీలోని చెల్లి వినవే అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో చేతిపై రాణి పాప అని రాసుంది. చెయి పక్కన గ్రద్ద కూడా ఉంది. పోస్టర్ తోనే సాంగ్ పై ఆసక్తిని కలిగించారు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates