HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే..

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే..

 

10 18ఈ రోజు (ఆదివారం) ప్రముఖ నటుడు నాగార్జున హోస్ట్‌గా అట్టహసంగా ప్రారంభమైన తెలుగు బిగ్‌బాస్‌ షోలో ముందుగా మనకు వినిపించిన సభ్యులే ఎంట్రీ ఇచ్చారు.

1. సావిత్రి (శివజ్యోతి), 2.రవికృష్ణ, 3. అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌), 4. టీవీ9 జర్నలిస్ట్‌ జాఫర్‌, 5. హిమజ, 6. రాహుల్‌ సిప్లిగంజ్, 7. రోహిణి, 8.బాబా భాస్కర్‌ మాస్టర్‌, 9. ఉయ్యాలజంపాల ఫేం పునర్ణవి భూపాలం, 10.హేమ, 11. అలీ రెజా, 12. మహేష్‌ విట్టా, 13.శ్రీముఖి, 14. వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు

1. సావిత్రి:
తెలంగాణలో తీన్మార్‌ వార్తలు ఎంత ఫేమస్‌ అయిందో.. సావిత్రి కూడా అంతే ఫేమస్‌ అయింది. సావిత్రక్కగా వీక్షకుల్లో అభిమానం సంపాదించుకున్న ఈమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి తీన్మార్‌ వార్తల్లో రాకుండా.. సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన అభిమాన గణాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌లో నిత్యం టచ్‌లో ఉన్నారు. వార్తలు చదువుతూ, సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే సావిత్రి.. తెలంగాణ యాసలో ఆకట్టుకోవడం ప్రధాన బలం. మరి సావిత్రి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా తోటి కంటెస్టెంట్ల అభిమానంతో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ.. చివరి వరకు నిలిచి విన్నర్‌గా నిలుస్తుందా? అన్నది చూడాలి.

2. రవికృష్ణ:
రెండో లక్కీ డిప్‌లో రెడ్‌ కార్డ్‌తో సీరియల్‌ నటుడు రవికృష్ణ ఎంట్రీ ఇచ్చాడు

3. అషూరెడ్డి
మూడో కంటెస్టెంట్‌గా పింక్‌ కార్డ్‌తో డబ్‌ స్మాష్‌ స్టార్‌ అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.

4.జాఫర్‌
ప్రముఖ వార్తా ఛానెల్‌ యాంకర్‌, హోస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన జాఫర్‌.. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాడు. ఈయన సెలబ్రెటీలను అడిగే ప్రశ్నలు, ఇంటర్వ్యూ చేసే విధానం లాంటివి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఈయన గొంతును, యాంకరింగ్‌ను చాలామంది అనుకరిస్తుంటారు. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న అతికొద్దిమంది పాత్రికేయుల్లో జాఫర్‌ ఒకరు. మరి ఈయన బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేస్తూ చివరి వరకు పోరాడతారా? అన్నది చూడాలి.

5.హిమజ
సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటిస్తు మంచి గుర్తింపును తెచ్చుకున్న హిమజ.. బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. స్పైడర్‌, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లకు ఏవిధమైన పోటీ ఇస్తారో? చూడాలి.

6. రాహుల్‌ సిప్లిగంజ్‌
ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. మిగతా కంటెస్టెంట్లను తన పాటలతో అలరించాడు. ప్రతీ సీజన్‌లో ఓ సింగర్‌ ఉండేట్లు చూసుకుంటున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు.. ఈసారి రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్న రాహుల్‌.. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటాడు. గత సీజన్‌లో మాధిరి కల్పనా, గీతామాధురిల జాబితాలో రాహుల్‌ చేరి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారా? అనేది చూడాలి.

7.రోషిణి
రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే రోహిణి.. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది. మరి రోహిణి కడవరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

8.బాబా భాస్కర్‌
హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. ఇంటి సభ్యులతో సందడి చేశారు. మిగతా కంటెస్టెంట్లకు సంధించిన ప్రశ్నలనే బాబా బాస్కర్‌కూ సంధించారు. కొరియోగ్రాఫర్స్‌లో బాబా భాస్కర్‌ శైలి వేరన్న సంగతి తెలిసిందే. సెట్లో ఈయన చేసే అల్లరి గురించి, బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో ఈయన చేసే సందడిని చూసే ఉంటారు. మగధీర చిత్రంలోన పంచదార బొమ్మా అనే పాట తన లైఫ్‌కు టర్నింగ్‌పాయింట్‌ అని చెప్పుకునే ఈ కొరియోగ్రాఫర్‌కు.. బిగ్‌బాస్‌ కూడా మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందా? అన్నది చూడాలి.

9.పునర్నవి భూపాలం
బిగ్‌బాస్‌ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల చిత్రంలో జండూభామ్‌(సునీత)గా ప్రేక్షకులను అలరించి.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌ కూతురు పార్వతి పాత్రలో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. క్రేజ్‌ను సంపాదించుకుంటోన్న పునర్నవి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వందరోజుల పాటు సాగే ఈ షోలో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఎలిమినేషన్స్‌ను తప్పించుకుని చివరి వరకు కొనసాగుతుందా?

10.హేమ
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పదో పార్టిసిపెంట్‌గా ప్రముఖ నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న నటి హేమ. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే హేమ.. మా(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో వివాదాస్పదమవుతూ ఫైర్‌ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హేమ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిక్కచ్చిగా ఉండే హేమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

11.అలీ రెజా
బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పదకొండో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటుడు అలీ రెజా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లోకి వస్తూనే అందర్నీ పలకరించి.. ఫుల్‌ యాక్టివ్‌ మోడ్‌లో ఉన్నాడు అలీ రెజా. సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూ వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు అలీ రెజా. ధృవ సినిమాలో రామ్‌ చరణ్‌ స్నేహితుడిగా పోలీస్‌ పాత్రలో నటించాడు. మరి బిగ్‌బాస్‌లో వీక్షకులను ఎంటర్‌టైన్‌ చేసి.. క్రేజ్‌ను సంపాదించుకుని స్టార్‌గా ఎదుగుతాడా? అన్నది చూడాలి.

12.మహేష్‌ విట్టా
పన్నెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మహేష్‌ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఫేమస్‌ అయిన మహేష్‌ విట్టా.. సినిమాల్లోనూ నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. హీరోగా ఫ్రెండ్‌ పాత్రల్లో నటిస్తూ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరి ఇదే విధంగా బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా నవ్వులు పూయించి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్‌ చేసి.. విన్నర్‌గా నిలుస్తాడా?

13. శ్రీముఖి
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి శ్రీముఖి పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్సులతో అదరగొడుతూ స్టేజ్‌పై దుమ్ముదులిపింది. ఇక తనకు కలిసి వచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్‌చల్‌ చేసింది. ఇంట్లోకి ప్రవేశిస్తూనే.. ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చుట్టూ పరిసరాలను గమనిస్తూ లివింగ్‌ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌మేట్స్‌ను పలకరించిన అనంతరం.. వారు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

పటాస్‌ షోతో బుల్లితెరను ఓ ఊపు ఊపిన శ్రీముఖి.. యాంకర్‌ రవితో పాటు పటాస్‌ షో చేసిన అనతి కాలంలోనే స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రాములమ్మ స్టెప్పులతో తన ఐడెంటీని క్రియేట్‌ చేసుకున్న శ్రీముఖి.. వెండితెరకూ సుపరిచితురాలే. అడపదడపాగా నటిస్తూ ఉన్నా.. బుల్లితెరపై హోస్ట్‌గానే ఎక్కువ నేమ్‌,ఫేమ్‌ సొంతం చేసుకుంది. అయితే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందున గతకొంతకాలం నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలకు విరామం ఇచ్చి.. ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తూ సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తోంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన సైన్యాన్ని సిద్దం చేసుకుని.. కడవరకు నిలిచేందుకు, మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టి పోటి ఇచ్చేందుకు రెడీ అయింది.

14. వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు
బిగ్‌బాస్‌లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌, ఆయన సతీమణి వితికా షేరు హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్‌లో ఎలా ఉంటారు? టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి.

10a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu