కామెడీ పాత్రలో సమంతా..?

తెలుగు, తమిళ బాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోన్న నటి సమంత. అటు గ్లామర్ పరంగా ఇటు నటన పరంగా తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఆమె ఈ స్థానానికి చేరుకుంది. ఇకపై నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే చేస్తానని ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు దానికి తగ్గట్లుగా విభిన్న పాత్రలను ఎన్నుకుంటూ తను తాను తెరపై కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సావిత్రి, రాజు గారి గది వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా తమిళంలో మరో సినిమా సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

విశాల్ హీరోగా నటిస్తోన్న ‘ఇరుంబు తిరై’ అనే సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత పాత్రకి కామెడీ కోటింగ్ పుష్కలంగా యాడ్ చేశారట. రోబో శంకర్ తో కలిసి ఆమె చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని చెబుతున్నారు. సమంత ఈ స్థాయిలో కామెడీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.