HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-3 (సెప్టెంబర్ 14) 56వ ఎపిసోడ్ హైలైట్స్

బిగ్‌బాస్‌-3 (సెప్టెంబర్ 14) 56వ ఎపిసోడ్ హైలైట్స్

17ఈ రోజు(14 సెప్టెంబర్) బిగ్‌బాస్‌ 56వ ఎసిసోడ్ ప్రసారమైంది. నిన్నటి ఎపిసోడ్‌కి కొనసాగింపు చూపించాడు బిగ్‌బాస్. రవి, వితికా, శిల్పా, శివజ్యోతి, బాబా మాస్టర్‌లు ఒక టీమ్‌. వరుణ్‌, శ్రీముఖి, రాహుల్‌, పునర్నవి, హిమజ మరో టీమ్‌గా ట్రైబర్‌ కారుపై పిక్నిక్‌కి వెళ్లారు.. కారులోని సౌకర్యాల గురించి వివరించారు. ఈ వారం వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కోసం డజ్లర్‌ వారి మేకోవర్స్‌ ఉపయోగించి ఆడవాళ్లంతా సిద్ధం కావాలని సూచించారు.. ఎప్పుడూ.. చాలా జోష్ మీద, పాటతో వచ్చే నాగార్జున చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. ముందు స్టేజ్‌పై తానే షూపాలిష్‌ చేసి చూపించాడు. ముందుగా మహేష్‌ కు క్లాస్‌ ఇచ్చాడు. హౌస్‌ గేట్‌ తెరిపించాడు. నేను నీ ఇన్విటేషన్‌ చింపేస్తాను.. నువ్వు వెళ్లిపోవచ్చు అన్నాడు. తరువాత మహేష్‌ను వదిలేసి శ్రీముఖిపై ఫైర్‌ అయ్యాడు.. నువ్వు ఈ ఇంటికి బాస్‌ కాదు. నువ్వు టాస్క్‌ రద్దు చేసి మిగతా నలుగురి అభిప్రాయం కూడా నువ్వే చెప్పేశావు అన్నారు. ఇక పునర్నవి చేసిన ఒవరాక్షన్‌ గురించి మాట్లాడాడు. శిల్పా నువ్వు వైల్డ్‌ కార్డు ఎంట్రీ అంటే.. వైల్డ్‌గా ఆడాలని కాదు .. నువ్వు సరిగా ఆడలేదు అని సీరియస్ అయ్యాడు. తర్వాత రాహుల్‌, వితికాను మెచ్చుకున్నాడు.

17a

బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధుని తీసుకువచ్చాడు నాగ్‌. కోచ్ పుల్లెల గోపీచంద్‌ కూడా స్టేజ్‌పైకి వచ్చారు.. ఇక సింధు గురించి గోపీచంద్‌ మాట్లాడారు. తరువాత వారిని సాగనంపిన తరువాత బాబా మాస్టర్‌తో మాట్లాడాడు.. శివజ్యోతిని మెచ్చుకున్నాడు.. కన్నీరు పెట్టుకోవడం లేదు.. చాలా మంచిది ఎప్పుడూ ఏడవద్దు అని చెప్పాడు.. ఇక గేమ్‌ స్టార్‌ చేశాడు. ‘మహానటి( లేదా)మహానటుడు’, ‘అంతకు మించి’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా తనకు మహానటి, అంతకుమించి అనే బిరుదులు ఎవరికి కరెక్ట్ అనుకుంటున్నారో వారికి ఇవ్వాలి. ఈ కింది విధంగా వాటిని సెలెక్ట్ చేసుకున్నారు.

వితికా: మహానటి- హిమజ… అంతకు మించి- శిల్పా
వరుణ్‌: మహానటి-శిల్పా.. అంతకు మించి-మహేష్‌
హిమజ: మహానటి-శ్రీ ముఖి.. అంతకు మించి- వితికా
పునర్నవి: మహానటి- హిమజ.. అంతకు మించి- రాహుల్‌
శ్రీముఖి: మహానటుడు-మహేష్‌.. అంతకు మించి- హిమజ
శివజ్యోతి: మహానటుడు-బాబా మాస్టార్‌.. అంతకు మించి- రాహుల్‌
రాహుల్‌: మహానటి- శివజ్యోతి.. అంతకు మించి- పునర్నవి
శిల్పా: మహానటుడు-బాబా.. అంతకు మించి- పునర్నవి
మహేష్‌: మహానటి-పునర్నవి.. అంతకు మించి- రాహుల్‌
బాబా మాస్టార్‌: మహానటి-హిమజ.. అంతకు మించి- శిల్పా
రవి: మహానటి-శిల్పా.. అంతకు మించి- మహేష్‌

ఈ గేమ్‌ అనంతరం ఎలిమినేషన్‌ రౌండ్‌లోకి వెళ్లిపోయాడు నాగ్‌… కాగా ఈ వారం ఎలిమినేషన్‌లో మహేష్‌, పునర్నవి, శ్రీముఖి, హిమజ, శిల్ప ఉన్నారు. ఈ ఐదుగురిని ఒక్కొక్కరిని ఒక్కో రూమ్‌లోకి పంపించాడు. హిమజ డోర్‌ ఓపెన్‌ కావడంతో హిమజ సేవ్‌ అయింది. మిగతా నలుగురు ఎలిమినేషన్‌లో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu