మహేష్ అభిమన్యుడా..?

‘శ్రీమంతుడు’,’బ్రహ్మోత్సవం’ ఇలా వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తోన్న మహేష్ బాబు ప్రస్తుతం
మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెలుగు,
తమిళ బాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మురుగదాస్, మహేష్ వంటి క్రేజీ కాంబినేషన్ లో
వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగా మురుగదాస్ ఎక్కడా..
కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తున్నాడు. అయితే మొదట ఈ సినిమాకు టైటిల్ గా ఎనిమీ
అనుకున్నారు. ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు హల్ చల్ చేశాయి.
ఆ తరువాత వాస్కోడగామా అనే మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ టైటిల్స్ పై చిత్రబృందం
ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ సినిమాకు ‘అభిమన్యుడు’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారనే
వార్త వినిపిస్తోంది. మహేష్ కు కూడా ఈ టైటిల్ బాగా నచ్చిందట. సో.. దాదాపు ఈ టైటిల్ నే కన్ఫర్మ్
చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారో.. లేదో..
చూడాలి!
CLICK HERE!! For the aha Latest Updates