మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడా..?

వెండితెరపై మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ చూడాలని అభిమానులు ఎప్పటినుండో అనుకుంటున్నారు. వన్ నేనొక్కడినే సినిమా సమయంలో కూడా మహేష్ సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించాడు. కానీ మధ్యలోనే ఆ ఆలోచన విరమించుకున్నారు. దాంతో ఆయనను సిక్స్ ప్యాక్ లో చూడాలనుకున్న అభిమానుల కోరిక నెరవేరలేదు. అయితే ‘స్పైడర్’ సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది.

రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ లో కూడా మహేష్ మరింత ఫిట్ గా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే పాత్ర కాబట్టి ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ తో కనిపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అలానే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తోన్న ఎస్.జె.సూర్య కూడా కండలు తిర్గిన దేహంతో కనిపించబోతున్నాడని టాక్.