HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: ఆ ఇద్ద‌ర్నీ సభ్యులు బ్యాగు స‌ర్దుకోమ‌న్న నాగ్‌

బిగ్‌బాస్‌: ఆ ఇద్ద‌ర్నీ సభ్యులు బ్యాగు స‌ర్దుకోమ‌న్న నాగ్‌

double elimination in thisతెలుగు బిగ్‌బాస్-4 ఏడో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్య టైమ్‌ వచ్చేసింది. కాగా ఇప్పటి వరుకు సూర్య‌కిర‌ణ్‌, క‌ల్యాణి, దేవి, స్వాతి, సుజాత‌ ఎలిమినేట్‌ అయ్యగా గంగవ్వ తన ఇష్టప్రకారం ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తక్కువ ఓట్లు వ‌చ్చిన మోనాల్ ఎలిమినేట్ అవుతుంద‌ని అంద‌రూ ఊహించగా.. అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ కుమార్ సాయి వెళ్లిపోనున్నాడ‌ని సోస‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మరో ట్విస్ట్‌ ఉండ‌బోతుందంటూ తాజాగా బిగ్‌బాస్ ఓ ప్రోమోను వ‌దిలాడు. ఈ రోజు రెగ్యుల‌ర్ ఎలిమినేషన్స్ జ‌ర‌గ‌ట్లేదు డిఫెరెంట్‌ అని నాగ్ బాంబ్ పేల్చారు. ఇద్ద‌రు సభ్యులను బ్యాగు స‌ర్దుకోమ‌న్నాడు. ఆ ఇద్ద‌రు మోనాల్‌, కుమార్ అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఈ ప్రోమోతో డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌బోతున్నట్లు చూపించాడు. అయితే నెటిజన్లు మాత్రం ఎలాగో కుమార్‌ను పంపిచేస్తున్నార‌ని, డ‌బుల్ ఎలిమినేష‌న్ పెట్టి మోనాల్‌ను కూడా వెళ్ల‌గొట్టండ‌ని సూచిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇది డబుల్ ఎలిమినేష‌న్ కాదు, బిగ్‌బాస్ ఆడుతున్న డ‌బుల్ గేమ్ అని మండిప‌డుతున్నారు. కానీ అది బిగ్‌బాస్ హౌస్‌.. అక్క‌డేమైనా జ‌ర‌గొచ్చు. కాబ‌ట్టి నేడు హౌస్‌ను వీడేది ఒక్క‌రా? ఏం జరుగుతుందో చూడాలంటే మరి కాసేపు వేచి చూడాల్సిందే.

Bigg boss-4: double elimination in this week

Recent Articles English

Gallery

Recent Articles Telugu