బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సొంత బ్యానర్లను స్థాపించి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బాలయ్య కూడా తన సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ అనే బ్యానర్ ను పెట్టారు. ఆ బ్యానర్ లో వరుసగా సినిమాలను నిర్మించాలని అనుకున్నారు. కానీ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. కొన్ని కారణాల వలన ఆ బ్యానర్ మీద సినిమాలు చేయడం వీలు కాలేదు. అయితే ఇప్పుడు అదే బ్యానర్ ను మళ్ళీ తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు బాలయ్య. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను ఈ బ్యానర్ లోనే తెరకెక్కించాలని భావిస్తున్నాడు. 
ఇప్పటికే ఈ బయోపిక్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయగలిగితే.. లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యానర్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే బాలయ్య ఇంత కాలం తరువాత ఇప్పుడు ఆ బ్యానర్ ను బయటకు తీశారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ గనుక లాభాలు తెచ్చిపెడితే ఇక బాలయ్య ఈ బ్యానర్ మీద వరుస సినిమాలను నిర్మించడం ఖాయం.