బిగ్ బీ మెచ్చిన నటుడు!

బాలీవుడ్ లో స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి హీరోలతో అమితాబ్ కలిసి నటించారు. అయితే మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ కు మాత్రం ఈ అవకాశం రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. విజయ్ కృష్ణ ఆచార్య అనే దర్శకుడు రూపొందిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ అనే సినిమాలో అమితాబ్, అమీర్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సంధర్భంగా అమీర్ ఖాన్ ‘ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పటికి వచ్చింది.. లెజందరీ నటుడు అమితాబ్ గారితో సినిమా చేయబోతున్నా” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి అమితాబ్ ”అమీర్ ఖాన్ పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నాకంటే గొప్ప నటుడు. తన నటన చూసి చాలా ఎంజాయ్ చేశాను” అన్నారు. అమితాబ్ వంటి నటుడు మరో నటుడు గురించి ఇలా మాట్లాడడం గొప్ప విషయం. అంతేకాదు నా కంటే తనే గొప్ప నటుడు అనడం అమీర్ ఖాన్ అభిమానులను సంతోష పెడుతోంది.
CLICK HERE!! For the aha Latest Updates