HomeTelugu Trendingసాయి పల్లవికి బాలీవుడ్ ఛాన్స్ !

సాయి పల్లవికి బాలీవుడ్ ఛాన్స్ !

Sai Pallavi Bollywood offer
శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి సాయి పల్లవి. విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నేచురల్ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ కోసం సాయిపల్లవిని సంప్రదించగా సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ ఫిదా బ్యూటీ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని తెలుస్తోంది. ఈ సినిమాకు వీవీ వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం రానాతో విరాటపర్వంలో నటిస్తోంది. నాగచైతన్య సరసన శేఖర్ కమ్ముల మూవీలో నటిస్తోంది. నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్‌లోనూ సాయి పల్లవి కీలకపాత్ర పోషిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu