HomeTelugu Trendingబిగ్‌బాస్‌-4: హారిక ఎలిమినేట్

బిగ్‌బాస్‌-4: హారిక ఎలిమినేట్

Bigg boss 4 telugu harika wతెలుగు బిగ్‌బాస్-4లో రెండో ఎలిమినేష‌న్ జ‌రిగిపోయింది. క‌‌రాటే క‌ల్యాణిని ఈ వారం మొదటిగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. ఇక ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉందంటూ నాగ్ ట్విస్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే నేడు మ‌రో కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి వెళ్ల‌గొట్ట‌నున్నారు. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేత్త‌డి హారిక‌ను ఎలిమినేట్‌ చేసి, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌నున్నార‌ని లీకువీరులు చెప్తున్నారు. మూడో సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను ఎలిమినేట్ అని చెప్పి, త‌ర్వాత సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. అత‌డి రీఎంట్రీ బాగా హిట్ట‌యింది. మ‌రీ ఈ సీజ‌న్‌లో ఫేక్ ఎలిమినేష‌న్ ఎంత‌మేర‌కు పండుతుందో చూడాలి.

ఇదిలా వుంటే నిన్న ఎలిమినేట్ అయిన క‌ల్యాణితో పాటు, అటు ఇంటి స‌భ్యులంద‌రితోనూ నాగ్ గేమ్స్ ఆడించిన‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా గంభీరంగా ఉన్న వాతావర‌ణాన్ని కూల్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఏం జరుగుతుందో.. తెలియాల‌టే మ‌రికొన్ని గంట‌లు వేచి చూడాలి..

Recent Articles English

Gallery

Recent Articles Telugu