HomeTelugu Trendingఇకపై నీదే బాద్యత.. అల్లుడిపై నాగబాబు ట్వీట్

ఇకపై నీదే బాద్యత.. అల్లుడిపై నాగబాబు ట్వీట్

Nagababu tweet about her da
మెగా ఫ్యామీలిలో పెళ్లి సందడి ప్రారంభమైంది. నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధ వేడుకను నిన్న (ఆగస్టు 13) గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలంతా సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత అందరూ ఈ మెగా వేడుకకు హాజరయ్యారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.

ప్రస్తుతం నిహారిక నిశ్చితార్ధం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారికకు మెగా ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిహారిక నిశ్చితార్థం తరువాత ఆమె తండ్రి నాగబాబు, అన్నయ్య వరుణ్ తేజ్ సోషల్‌ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నాగబాబు స్పందిస్తూ.. ”చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య” అంటూ అల్లుడిపై తనదైన స్టైల్లో కామెంట్ చేశారు నాగబాబు. ”నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా” అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం పలికారు వరుణ్ తేజ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu