చలిగాలుల్లో ఉక్కబోసే హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌కి హీట్ ఎక్కిస్తున్న ‘తేజస్వీ’

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ టాలీవుడ్‌కి అసలు సిసలు తెలుగు సొగసుల్ని చూపే పనిలో బిజీగా మారింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో టాలీవుడ్‌లో తొలి అడుగు పెట్టిన తేజస్వి రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ చిత్రంతో తనలోని హాట్ ఫ్లేవర్‌ని బయటకు తీసింది. తెలుగులో పలు చిన్నా చితకా చిత్రాల్లో నటించినా.. వర్మగారి ఐస్ క్రీమ్‌తోటే బాగా పాపులర్ అయ్యింది ఈ హైదరాబాదీ బ్యూటీ. ఈ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం దక్కించుకుంది. అక్కడ కూడా తనదైన శైలి బోల్డ్ అండ్ హాట్ కామెంట్స్‌లో గేమ్‌లో రచ్చ రచ్చ చేసి.. కౌశల్ ఆర్మీతో ఎక్కువ ట్రోల్ కాబడిన కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యింది. మరో కంటెస్టెంట్ సామ్రాట్‌తో లవ్ ట్రాక్ గేమ్ చివరి వరకూ లాక్కొచ్చి.. బయటకు వచ్చాక లవ్వూ లేదు గివ్వూ లేదు లైట్ తీస్కోండి బాస్.. అంటూ తనదైన శైలిలో కామెంట్‌ చేసింది.

ఆ షో తరువాత సినిమా ఆఫర్లు అయితే రాలేదు కాని.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో కలిసి కామెడీ షోకి హోస్ట్‌గా చేసే అవకాశం వచ్చింది. ఆ షో ఫ్లాప్ అయ్యింది. అయితే నటిగా తన ప్రయత్నాల్ని సోషల్ మీడియా వేదికగా వేగవంతం చేసింది. తనలోని లేలేత సొగసులకు పదును పెడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోతకు తెర తీసింది. గ్లామర్ డోస్‌ని పెంచేసి క్లీవేజ్‌ షోతో ఓపెన్ అయ్యింది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న డిజైనర్ డ్రెస్‌లో ఎద అందాలు కనిపించేలా బటన్స్ ఓపెన్ చేసి కవ్వించే కళ్లతో చలుగాలుల్లో ఉక్కబోత పెట్టించే పోజులతో రచ్చ చేస్తుంది. చేతులకు బ్యాండ్స్.. చెవులకు హెవీ రింగ్స్ పెట్టి ఫొటోకి మరింత కిక్కిచ్చేలా పోజు కొడుతోంది ఈ బ్యూటీ. ఈ ఫొటోపాటు అంతకు ముందు కూడా రెడ్ డ్రెస్‌లో, బ్లాంక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్‌లలో క్లీవేజ్ షోలతో ఇన్‌స్టాగ్రామ్‌కి హీట్ ఎక్కిస్తోంది.

View this post on Instagram

Mood.

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

View this post on Instagram

@jitendrabhagavatulaa

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

CLICK HERE!! For the aha Latest Updates