HomeTelugu Trendingక్వారెంటైన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌

క్వారెంటైన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌

Bigg boss contestants in qu
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటివరకు మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ ను కూడా ప్రారంభించేందుకు షో సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లను ముగ్గురు హోస్ట్ చేశారు. ఇక నాలుగో సీజన్ ను కూడా నాగార్జున నే హోస్ట్ చేస్తున్నాడు. ఇక ఇందులో కంటెస్టెంట్ లు ఎవరు అన్న విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తిగానే మిగిలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ ఈ నెల 30 న ప్రారంభం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్, సిబ్బంది అందరూ క్వారెంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ సెట్ సమీపంలోనే వీరిని నిర్బంధంలో ఉంచినట్లు అక్కడ నుండి నేరుగా బిగ్ బాస్ సెట్ లోకి పంపించబోతున్నారు అని తెలుస్తుంది. ఇక స్టేజ్ పైకి వారిని ఆహ్వానించే సమయంలో మాస్క్ లు, అలాగే సోలో ఎంట్రీలతో ఇంతక ముందు సీజన్ ల కంటే ఈ సీజన్ కొత్తగా ఉంటుంది అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu