HomeTelugu Big Storiesశ్రీముఖిని టార్గెట్‌ చేసిన బిగ్‌బాస్‌.. 100 పిడకలు .. వైరల్ అవుతున్న విజువల్

శ్రీముఖిని టార్గెట్‌ చేసిన బిగ్‌బాస్‌.. 100 పిడకలు .. వైరల్ అవుతున్న విజువల్

5 30‘బిగ్‌బాస్‌-3’ తెలుగు నిన్నటి ఎపిసోడ్‌లో ఒకటి కరెంట్ కోసం.. మరోటి గ్యాస్.. ఇంకోటి నీటి కోసం సైక్లింగ్ టాస్క్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌ వల్ల ఇంట్లో జరిగిన రచ్చ మనం చూశాం. అక్కడ తొక్కితేనే ఇక్కడ ఇవన్నీ వస్తాయి లేదంటే లేదు. అది నడుస్తుండగానే ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ రోజు ప్రోమోలో మరో ఆసక్తికరమైన విజువల్ వచ్చింది. ఈసారి శ్రీముఖిని టార్గెట్ చేసాడు. ఈమె 100 పిడకలు కొట్టాలని చెప్పేసరికి షాక్ అయిపోయింది. అయినా తప్పదు కదా.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు ఇవన్నీ కామన్. పైగా నామినేషన్స్‌లో కూడా టాప్‌లో ఉంది శ్రీముఖి. ఆమెను వీలైనంత త్వరగా పంపేయాలని డిసైడ్ అయిపోయారు ఇంటి సభ్యులు. ఆమెకు తెలియకుండానే శ్రీముఖిపై చాలా కుట్రలు చేస్తున్నారు. మరి చూడాలిక.. ఈ పిడకల టాస్క్‌ ఎలా ఉంటుందో.. ఇంట్లో ఎటువంటి పరిస్థితులు తిసుకువస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu