‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ ఘాటు వ్యాఖ్యలు!

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయిన బ్యూటీ షాలిని పాండే తాజాగా ముద్దులపై చేసిన కామెంట్స్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ముద్దు పెట్టుకోవడం ఒక ఎమోషన్ అని అంటూ ముద్దులో  మధుర స్పర్శతోపాటు మధురమైన భావాలను వ్యక్తీకరించుకునే మమతల శ్వాస ముద్దు అంటూ తన విలక్షణమైన అభిప్రాయలాను వ్యక్తీకరించింది. అంతేకాదు గమ్మత్తైన ముద్దులో లాలన ఉంటుంది ఓదార్పు ఉంటుంది అన్నింటికీ మించి ఆనందంతో కూడిన తృప్తి ఉంటుంది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అన్ని ముద్దు సీన్‌ లలో నటించారు ఇబ్బందిగా అనిపించలేదా అన్న ప్రశ్నకు  సమాధానం ఇస్తూ తాను  ఏదైనా పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచిస్తాను కాని ఆ సీన్ వెనుక ఉండే భావాల గురించి అలోచించను అంటూ కామెంట్స్ చేసింది. తాను ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ప్రీతి పాత్రలో అర్జున్ రెడ్డికి ముద్దు పెడుతున్నా అని అనుకున్నాను కాని ఆసీన్ లో ఏమైనా అశ్లీల కోణం ఉందా అన్నఆలోచనలు తనకు రాలేదు అన్న విషయాన్ని వివరించింది షాలినీ పాండే.