‘సైరా’ లో చిన్న విరామం సురేఖతో చిరంజీవి విహరం

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. జపాన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి చిరు సతీమణి సురేఖ వెళ్లారు. తన తల్లిదండ్రులు విరబూసిన సకురా పువ్వుల అందాల్ని తిలకిస్తున్నారంటూ సుస్మితా కొణిదెల ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా మౌంట్‌ఫుజీలో చిరు, సురేఖ కలిసి దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు. ‘మా నాన్నకు కాస్త విరామం ఇచ్చినందుకు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీకి ధన్యవాదాలు’ అని ఆమె సరదాగా పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘సైరా’ చిత్రానికి సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సురేందర్‌రెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతిథి పాత్రలో నిహారిక కనిపించన్నారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనకుంటున్నారట. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తారు.

CLICK HERE!! For the aha Latest Updates