HomeTelugu Trendingబిగ్‌బాస్ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

బిగ్‌బాస్ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Bigg boss winner sunny new
తెలుగు ‘బిగ్ బాస్-5’ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం విశేషం.

సన్నీతో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి​ బయటికి వచ్చాక హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రమిది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!