పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యంపై నాదెండ్ల వివరణ


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు వడదెబ్బ తగిలింది. ఇవాళ సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయణ్ను వ్యక్తిగత సిబ్బంది ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పవన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. భోజనం తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్‌ అయి పవన్‌ అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. మరో రెండు గంటల్లో పవన్‌ను డిశ్చార్జి చేస్తారని.. రేపటి ప్రచార కార్యక్రమాలు వైద్యుల సూచన మేరకు ఉంటాయని చెప్పారు.