HomeTelugu Trendingవిధ‍్వంసం సృష్టించిన విజయ్‌ అభిమానులు

విధ‍్వంసం సృష్టించిన విజయ్‌ అభిమానులు

3 24కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులు బీభత్సం సృష్టించారు. విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన ‘బిగిల్’ మూవీ శుక్రవారం విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించలేదంటూ ఆగ్రహించిన అభిమానులు గతరాత్రి తమిళనాడులోని కృష్ణగిరిలో రచ్చ రచ్చ చేశారు. సినిమా హాల్‌ను ధ్వంసం చేయడంతో సమీపంలోని దుకాణాలకు నిప్పుపెట్టారు.

అంతేకాకుండా పోలీస్‌, మున్సిపాలిటీ వాహనాలను తగులపెట్టారు. తమ హీరో సినిమాను ప్రదర్శించేవరకూ వెనక్కి తగ్గేది లేదంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెరదగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా విధ్వంసం సృష్టించిన 37మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్‌ చిత్రం తెలుగులో ‘విజిల్‌’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విజయ్‌ మాస్‌ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్‌ హాఫ్‌లో సెంటిమెంట్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్‌ అయ్యాడంటూ అభిమానులు ట్విట్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu