విశ్వనటుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ రోజు నవంబర్‌ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కమల్‌హాసన్. తెలుగులో స్వాతిముత్యం, సాగర సంగమం, విచిత్ర సహోదరులు, ఆకలి రాజ్యం, ఇంద్రుడు చంద్రుడు, నాయకుడు ఇలా ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్నారు. కమల్ హాసన్ అంటే మనందరికి గుర్తొచ్చే చిత్రం భారతీయుడు.

భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ నటన అద్బుతంగా ఉంటుంది. విశ్వరూపం సీక్వెల్ సినిమాలు చేసిన ఈ విశ్వనటుడు ప్రస్తుతం శంకర్ భారతీయుడు-2 కోసం సిద్ధం అవుతున్నాడు. ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు కమల్ హాసన్.