Homeతెలుగు Newsఏపీ రాజకీయాల్లో బిజెపి మూడు ముక్కలాట?

ఏపీ రాజకీయాల్లో బిజెపి మూడు ముక్కలాట?

BJPs three piece game in AP politics

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది అంతు చిక్కడం లేదు. కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం ఎవరికీ మద్దతు పలుకుతుందనేది సామాన్య ఓటర్ నాడికి అందడం లేదు. కర్ర విరగదు పాము చావదు సామెత చెప్పినట్లు మూడు పార్టీలతో సంప్రదింపులకు సై అంటున్నారు కానీ తమ మద్దతు ఎవరికి అనేది చెప్పడం లేదు.

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏనాడూ బిజెపిని జగన్ విమర్శించిన పాపాన పోలేదు. కేంద్రంలో మోడీ మళ్ళీ ప్రధాని అవుతారని, ఆయనతో సున్నం పెట్టుకోవడం ఎందుకని భావించారేమో!? ఏపీలో రాజకీయ పార్టీలను మాత్రమే టార్గెట్ చేశారు.

సిబిఐ కేసుల నుంచి విముక్తి కోసమే బిజెపితో జగన్ స్నేహం చేస్తున్నారని విమర్శ ఉంది. ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ అరెస్టు కాకుండా ఉండడం వెనుక ఆ స్నేహమే పనిచేస్తుందని గుసగుసలు ఉండనే ఉన్నాయి. అలాగని ఏనాడు జగన్ తమ మిత్రుడు అని బిజెపి చెప్పింది లేదు. శత్రువు గాను చూడడం లేదు. మరోవైపు ఏపీలో తలకు బద్ధ శత్రువులుగా జగన్ భావిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులతో సంప్రదింపులు జరుపుతోంది. పవన్ కళ్యాణ్ సైతం అప్పుడప్పుడు బిజెపి పెద్దలను కలిసి వస్తున్నారు. బిజెపి తీరు సామాన్య ప్రజలకు అంతు చికడం లేదు.

బిజెపి ముఖ్య నేత అమిత్ షా, జెపి నడ్డాలను చంద్రబాబు కలిశారు. ఈ పరిణామం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బిజెపితో కలిసి తెలుగుదేశం పోటీ చేసినప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాళ్లకు జనసేన మద్దతు పలికింది. రాబోయే ఎన్నికలలో తమ మద్దతు తెలుగుదేశానికి అని బిజెపి ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి ఎదురైనట్టే. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కేంద్రంలోని అధికార ప్రభుత్వ అండ ప్రత్యర్థికి ఉంటే ఎన్నికల్లో ఎదురీత తప్పదు. ప్రస్తుతానికి అయితే ఏపీ రాజకీయాలలో బిజెపి మూడు ముక్కలాటాడుతుంది. ఈ ఆట ఆపేసి త్వరలో ఎవరో ఒకరికి మద్దతు పలికితే ఏపీ రాజకీయం ఒక చిత్రం ఏమిటనేది ఒక స్పష్టత వస్తుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu