HomeTelugu TrendingOGలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు

OGలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు

bollywood actor Emraan Hashపవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. దానిలో సుజీత్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఓజీ ఒకటి. ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టార్‌ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో మంచి హోప్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీంతో నటీనటులు కూడా ఒక్కొక్కరుగా షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మెయిన్‌ విలన్‌ కూడా ఇప్పుడు సెట్‌లో అడుగుపెట్టాడు.

బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ హష్మి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తాజాగా ఒక ట్వీట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో ఇమ్రాన్‌ హష్మి తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. బాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరోగా పేరున్న ఇమ్రాన్‌ హష్మికి విలన్‌గా ఇది రెండో సినిమా. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న టైగర్‌ 3లో ఇమ్రాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

ఇక ఓజీ సినిమా విషయానికొస్తే విక్రమ్‌, మాస్టర్‌ సినిమాల్లో విలన్‌గా నటించిన క్రేజీ యాక్టర్‌ అర్జున్‌ దాస్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతను కూడా తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. కోలీవుడ్‌ యాక్టర్‌ విశాల్‌ మరదలు శ్రియా రెడ్డి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu