HomeTelugu Trendingబాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

2 28
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో కన్ను మూసారు. నిన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను ముంబై లోని ధీరూబాయ్ అంబానీ హాస్పటల్ లో చేర్పించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోల్కొన్నారు. మూడు రోజుల క్రితం ( ఆదివారం ) ఆయన తల్లి చనిపోయారు. లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ తల్లిని చివరిసారి చూడలేక పోయారు. వీడియో కాల్ ద్వారా ఆయన తన తల్లి అంత్యక్రియలను వీక్షించారు. తల్లి మరణం తర్వాత ఇర్ఫాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇర్ఫాన్ బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను పలుసినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో పప్పు యాదవ్‌గా అలరించారు. ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త తో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu