బేబీ బంప్‌తో ఆలియా.. వైరల్‌


బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా తన ప్రెగ్నెన్సీ వార్తను ప్రకటించింది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్‌కి ఏమాత్రం బ్రేక్‌ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్‌లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్‌బీర్‌-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఓ సాంగ్‌ ప్రివ్యూ లాంచ్‌ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు.

భర్తతో కనిపించిన ఆలియా భట్‌ తొలిసారిగా తన బేబీ బంప్‌ కనిపించేలా డ్రెస్‌ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్‌, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

https://www.instagram.com/p/Cg6gAb-PjQb/?utm_source=ig_web_copy_link

 

CLICK HERE!! For the aha Latest Updates