సుశాంత్‌ ప్రియురాలు రియా అరెస్ట్‌..


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో అయన గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు రియాను అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్‌ కేసులో రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురుని అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే వారందరికీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా సుశాంత్‌ సింగ్‌ మృతి చెందిన్నప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రియా తమ్ముడు షోవిక్, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరిండాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates