HomeTelugu Trendingబన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో!

బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో!

3 10
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. కాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఆ సినిమా పేరుతో పాటుగా సినిమాలో బన్నీ లుక్ ని విడుదల చేసింది మూవీ యూనిట్‌. అయితే ఈ సినిమాకు “పుష్ప” అనే ఫిక్స్‌ చేశారు. అలాగే ఆ పోస్టర్ లో బన్నీ రఫ్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ లుక్ ట్విట్టర్ లో రికార్డు నమోదు చేసింది. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ గా పుష్ప సినిమా బన్నీ లుక్ నిలిచింది. అయితే పుష్ప సినిమా బన్నీ మెదటి పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషలలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో విలన్ గా ఓ బాలీవుడ్ హీరో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నాడట సుకుమార్. అయితే ఇది ఎంత వరుకు నిజమో అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu