HomeTelugu Trendingబాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

Bollywood senior actor mith
ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది(67) కన్నుమూశారు. నేడు(ఆగస్ట్‌ 3న) గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో లక్నోలోని తన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లండించారు. దీంతో బాలీవుడ్‌ సినీ,టీవీ నటినటులు ఆయన మృతిపై దిగ్భ్రాంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

కోయి మిల్‌ గయా, ఆశోక, గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, బంటీ జౌర్‌ బబ్లీ, క్రిష్‌, రెడీ, ఆజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ, సత్య వంటి ఎన్నో హిట్‌ చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌తో పాటు ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌లో కూడా ఆయన నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu