రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘నన్ను దోచుకుందువటే’

‘సమ్మోహనం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత సుధీర్‌బాబు నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌. నాయుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా టీమ్‌ చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. అజనీష్‌ సంగీతం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది’ అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘మా చిత్రం ప్రీప్రమోషనల్‌ టూర్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్‌.ఎస్‌.నాయుడు చాలా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో సినిమా రూపొందించాడు. ‘సమ్మోహనం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత, నా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని తప్పకుండా రీచ్‌ అవుతామనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. సాయి వరుణ్‌. ఈ చిత్రంలో నాజర్‌, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందరరాజన్‌, సుదర్శన్‌ తదితరులు నటించారు.