బోనీ కపూర్ ఇంట కరోనా పాజిటివ్ కేసు‌.!

బాలీవుడ్‌ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ పని చేస్తున్న 23 ఏళ్ల యువకుడు చరణ్‌ సాహూ సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల నిర్వహించగా కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ముంబై కార్పోరేషన్ అధికారులు అతన్ని క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.

దీని పై స్పందించిన బోనికపూర్ తాను, తన కుమార్తెలు, ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరం బాగానే ఉన్నామని, తమకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచీ తాము ఇంట్లోనే ఉన్నామని తెలిపారు. బీఎంసీ, వైద్యాధికారుల సూచనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్‌ సాహూ కూడా త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.