బోయపాటి సినిమా నుండి నిర్మాత ఔట్!

‘సరైనోడు’ చిత్రంతో హిట్ కొట్టిన బోయపాటి తన తదుపరి సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా
నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి చాలా రోజులు అయింది. కానీ సెట్స్ మీదకు మాత్రం
వెళ్లట్లేదు. దానికి రకరకాల కారణాలు చెప్పినా… అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి
నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
దీంతో బెల్లంకొండ సురేశ్ కొడుకు కోసం మరో నిర్మాతను రంగంలోకి దింపాడు. సాహసం
శ్వాసగా సాగిపో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఎం.రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిమించబోతున్నారు.
మరో రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. నిజానికి బోయపాటికి
సరైనోడు సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ఆ సమయంలో ఈ సినిమా నుండి
తప్పుకుందామని అనుకున్నాడు కానీ ఇచ్చిన కమిట్మెంట్ వలన కుదరక సినిమా చేస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates