విలక్షణ నటుడికి పాండిచేరి ప్రభుత్వం సన్మానం!

నటుడిగా, వ్యక్తిగా డా.మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు ఈరోజు సాయంత్రం యానాంలో జరగనున్న వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానం చేయనుంది. ఈ సన్మాన వేడుకలో పాండిచేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాలుపంచుకోనున్నారు.
నటుడిగా చిత్ర పరిశ్రమకు, వ్యక్తిగా “శ్రీ విద్యానికేతన్” ద్వారా విద్యా వ్యవస్థకు ఎంతో సేవ చేసిన మోహన్ బాబుగారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పాండిచేరి కళాశాఖ నిర్వాహకులు తెలిపారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here