జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారం సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కు ఏ ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సినిమాకు ది ఐరన్ లేడీ అనే టైటిల్ ను పెట్టారు.

ఈ టైటిల్ పై ప్రముఖ దర్శకుడు మురుగదాస్ స్పందించారు. బయోపిక్ టైటిల్ బాగుందని, సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్తూ ఆయన యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు