HomeTelugu Trending'సైరా' కోసం గుండుకొట్టించుకున్న బ్రహ్మీజీ

‘సైరా’ కోసం గుండుకొట్టించుకున్న బ్రహ్మీజీ

4 3మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి కలెక్షన్లు కురుస్తున్నాయి. అభిమానులే కాదు సినీ తారలు సైతం ‘సైరా నరసింహారెడ్డి’ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ చిత్ర మేకింగ్‌ కష్టాల్ని మరిచిపోయేలా చేసింది. ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ప్రాణం పెట్టి చేశారనడంలో అతిశయోక్తి లేదు. సైరాలో నటించిన బ్రహ్మాజీ కూడా ఆ కోవకే చెందుతాడు. పాత్ర కోసం తనని తాను మలుచుకోడానికి సిద్ధపడిపోయాడు. అందుకోసం హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడమే కాక గుండు కొట్టించుకున్నాడు. సైరా చిత్రీకరణ సమయంలో గుండు కొట్టించుకున్న చిత్రాలను బ్రహ్మాజీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సైరాలో ఏదైనా పాత్ర ఇవ్వమని రామ్‌చరణ్‌ను అడిగాను. కానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇస్తాడనుకోలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు సినిమా యూనిట్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. ఈ ఫొటోలో గుండు కొట్టిన తర్వాత పూర్తిగా పాత్రలో లీనమైపోయిన బ్రహ్మాజీని చూడవచ్చు. పైగా రామ్‌చరణ్‌ దగ్గరుండి మరీ గుండు కొట్టిస్తున్నాడు. కాగా పోరాట ఘట్టాల్లో బ్రహ్మజీ నటన అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu