HomeTelugu Trendingరేణుదేశాయ్‌ రీ ఎంట్రీ..

రేణుదేశాయ్‌ రీ ఎంట్రీ..

Renu desai back to acting
నటి రేణుదేశాయ్.. మళ్ళీ కెమరా ముందుకు రాబోతున్నట్టుగా వెల్లడించారు. ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, కథ నచ్చడం తో ఒకే చెప్పానని రేణు దేశాయ్ తెలిపారు. భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించింది. అంతేకాకుండా మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది. రైతులపై సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు రేణు దేశాయ్ .తాజాగా ఆమె సోషల్ మీడియా వేదిక గా తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని వెల్లడించింది. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశాను. మీ అందరి ఆశీర్వాదం కావలి . వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు అవుతుంది. ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల డైరెక్షన్‌లో వస్తుంది. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు” అని రేణు దేశాయ్‌ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu