HomeTelugu Trending'కోబ్రా' టీజర్‌

‘కోబ్రా’ టీజర్‌

Vikram Cobra Teaserతమిళ నటుడు చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌ కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా శనివారం ‘కోబ్రా’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇందులో విక్రమ్‌ తన తెలివితో రకరకాల గెటప్స్ మారుస్తూ క్రైమ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని పట్టుకునే ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపిస్తున్నాడు. దీంట్లో విక్రమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్ – మృణాలిని – కనికా – పద్మప్రియ – బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం తన మార్కును తెలియజేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu