HomeTelugu Trendingసిరీయల్స్‌లో నటించనున్న బ్రహ్మానందం..

సిరీయల్స్‌లో నటించనున్న బ్రహ్మానందం..

9

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ బ్రహ్మానందం.. ఇక నుంచి బుల్లితెరపై వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య బ్రహ్మికి అవకాశాలు కాస్త తగ్గాయి.. కొత్త కమెడియన్లు రావడం, గతేడాది ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం.. ఆపరేషన్ కూడా చేయించుకోవడంతో బ్రహ్మానందం మునపటిలా జోరు చూపించలేకపోతున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. బుల్లితెర పై కూడా ఓ వెలుగు వెలగాలని అనుకుంటున్నాడట. ఇటీవలే.. బ్రహ్మి కామెడీ షో అని ఓ రియాలిటీ షో ని చేసిన అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

దానితో.. ఓ డైలీ సీరియల్ ద్వారా బుల్లితెర పై కనిపించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ ఛానెల్‌తో ఆయన ఒప్పందం కూడా చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక బ్రహ్మిని బుల్లితెరపై చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీరియల్‌లో నటించడానికి ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని మార్పులు చేయాలని దర్శక నిర్మాతలకు బ్రహ్మానందం సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని పూర్తయితే ఇక త్వరలోనే బ్రహ్మానందాన్ని బుల్లితెరపై కనువిందు చేస్తాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu