HomeTelugu Trending'సాహో' న్యూ యాక్షన్‌ పోస్టర్‌ రిలీజ్‌

‘సాహో’ న్యూ యాక్షన్‌ పోస్టర్‌ రిలీజ్‌

9 24యువ నటుడు ప్రభాస్‌ హీరోగా.. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌తో పాటు, పలు పోస్టర్లను విడుదల చేయగా, తాజాగా ఓ యాక్షన్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌లు తుపాకులతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ కనిపించారు. ఇంతకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో ‘సాహో’ అలరించడం ఖాయమని చిత్ర బృందం చెబుతోంది. ‘ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాలను గతంలో చూసి ఉండరు. భారతదేశపు అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టులో రాబోతోంది’ అని యువీ క్రియేషన్స్‌ తెలిపింది.

జాకీష్రాఫ్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, నీల్‌ నితిన్‌ ముకేశ్‌, టినూ ఆనంద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తనిష్క్‌ బాగ్చీ, జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu