HomeTelugu Trending'హిట్‌' డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌

‘హిట్‌’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌

NTR with Hit director

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కూడా అలాగే ఓ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమధ్య విష్వక్ సేన్ హీరోగా ‘హిట్’ చిత్రాన్ని చేసి, హిట్ చేసిన శైలేశ్ కొలను ఇప్పుడు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శైలేశ్ ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ కథ చెప్పగా ఆయనకు అది బాగా నచ్చిందట. ఈ కథ ఎన్టీఆర్‌కి అయితే కరెక్టుగా సూటవుతుందని చెప్పిన దిల్ రాజు.. అతనిని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారట. కథ విన్న ఎన్టీఆర్ వెంటనే శైలేశ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బీజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. అలాగే, శైలేశ్ ప్రస్తుతం ‘హిట్’ చిత్రాన్ని హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఈ ప్రాజక్టులు పూర్తయ్యాక, ఎన్టీఆర్ తో శైలేశ్ సినిమా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu